నదీజలాల వాటాల విషయంలో పట్టుదలగా కెసిఆర్
కేంద్రంతో అవిూతువిూ తేల్చుకునే దిశగా అధ్యయనం
నదీజిలాలపై అధికారులతో సమగ్రంగా చర్చలు
హైదరాబాద్,ఆగస్ట్7(జనంసాక్షి): కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్టాన్రికికి దక్కే వాటాల విషయంలో రాజీపడరాదని తెలంగాణ సిఎం పట్టుదలగా ఉన్నారు. ఇదే క్రమంలో 9న జరిగే బోర్డు విూగింగ్‌కు హాజరు కారాదని అధికారులు కూడా ఇప్పటికే తేల్చి చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు స్పష్టం చేశారు. ఆయా అంశాల్లో రాష్ట్రం లేవనెత్తే అభ్యంతరాలపై కేంద్రం స్పందించే తీరును బట్టి.. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని సమావేశంలో సూచనలు వచ్చినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక సుప్రీంలో తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఉపసంహరణ పూర్తయితే.. ఆ వెంటనే సెక్షన్`3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు, కృష్ణా జలాల పునఃపంపిణీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్ర వ్యవసాయం, రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని.. ప్రభుత్వ యంత్రాంగం అంతా పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో కలిగే లాభనష్టాలపై చర్చించిన సిఎం ఈ విషయంలో అవిూతువిూకి సిద్దపడినట్లు సమాచారం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో మన వాటా సంగతి తేల్చాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించే నదీ బోర్డుల సమావేశాల్లో తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత సవిూక్షా సమావేశం జరిగింది. తెలంగాణకు హక్కుగా కేటాయించిన, న్యాయమైన నీటివాటాలకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పులు, తాజాగా కేంద్రం జారీ చేసిన గెజిట్‌లోని అంశాలపై క్షుణ్నంగా చర్చించారు. గోదావరి, కృష్ణా జలాల్లో ఉభయరాష్టాల్రకు ఉండే నీటివాటాల లెక్కలనూ పరిశీలించారు. కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాల్లో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఈ అంశాలపై ఆదివారం కూడా సమావేశమై చర్చించాలని నిర్ణయించారు. కేంద్ర గెజిట్‌లోని అంశాలు, వాటితో రాష్ట్ర ప్రాజెక్టులపై పడే ప్రభావం, బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు తేవడం, వాటికి అనుమతులు, నిధుల చెల్లింపులు తదితర అంశాలపైనా సవిూక్షా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. గెజిట్‌లోని అంశాలకు సంబంధించి రాష్టాన్రికి ఉన్న అభ్యంతరాలపై వీలైనంత త్వరలో కేంద్రానికి లేఖలు రాయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ప్రధానంగా ఉమ్మడి ప్రాజెక్టులు కాని వాటిని సైతం షెడ్యూల్`2లో చేర్చడం, వాటిపై బోర్డుల అజమాయిషీపై అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇక ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని గెజిట్‌లో పేర్కొన్న దృష్ట్యా.. ఏ ప్రాజెక్టులకు ఏయే అనుమతులు పొందాలి, ఈ విషయంగా కేంద్ర ప్రభుత్వ శాఖలు అందించే సహకారంపై స్పష్టత కోరాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. ఇక అనుమతుల్లేని ప్రాజెక్టులకు సంబంధించి రుణాలిచ్చిన సంస్థలు వివరణ కోరుతున్న నేపథ్యంలో.. నిర్దేశిత గడువులోగా వాటికి అనుమతులు సాధిస్తామన్న స్పష్టత ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయంలో బోర్డులు పెడుతున్న తొందర, ప్రాజెక్టులు, సంబంధిత పరిణామాలపై సిఎం కెసిఆర్ లోతుగా అధ్యయనం చేస్తున్నారు. గెజిట్ వెలువడిన మరుసటి రోజునుంచే దాని అమలుపై కార్యాచరణ మొదలు పెట్టాల్సిందిగా బోర్డులు లేఖల విూద లేఖలు రాయడం మొదలు పెట్టాయి. ప్రాజెక్టుల వివరాలు, ఇతర అంశాలకు సంబంధించి వివరాలు కోరుతున్నాయి. వీటిపై చర్చించేందుకు వరుస భేటీలు నిర్వహిస్తున్నాయి. బోర్డులు కోరుతున్న ప్రతి సమాచారం సున్నితమైన కీలక అంశాలకు సంబంధించినది కావడంతో, అధికారులు ప్రతి విషయాన్నీ అటు ప్రభుత్వం, ఇటు న్యాయవాదులతో చర్చించి ఖరారు చేయాల్సి వస్తోంది. గత నెల 16న గెజిట్ నోటిఫికేషన్ వెలువడిరదే ఆలస్యం.. బోర్డులు వీటి అమలుకు పూనుకున్నాయి. ఆమోదం లేని ప్రాజెక్టుల డీపీఆర్‌లు కోరుతూ లేఖలు రాశాయి. ఆ మరుసటి రోజే సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన సమాచారంతో రెండు లేఖలు, ఆ వెంటనే కమిటీ భేటీని నిర్వహిస్తామంటూ మరో రెండు లేఖాస్త్రాలు సంధించాయి. ఇదే క్రమంలో ఈనెల 3న కమిటీ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ భేటీకి తెలంగాణ గైర్హాజరు కాగా, ఏపీ తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఒక్కో అంశంపై అభిప్రాయాలను సిద్ధం చేసుకుంటున్న సమయంలో, 9న పూర్తి స్థాయి భేటీ నిర్వహిస్తామని రెండు బోర్డులు తెలంగాణకు లేఖలు రాశాయి. ఇలావుండగా 9వ తేదీనే కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ ఉపసంహరణకు సంబంధించి విచారణ జరగనుంది. ఏ కారణాలతో పిటిషన్ ఉపసంహరించుకుంటున్నారో తెలంగాణ కోర్టుకు వివరించాల్సి ఉంది. అదే రోజున రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ సైతం విచారణకు రానుంది. ఇక్కడ తెలంగాణ తన వాదనలు వినిపించాల్సి ఉంది. మరోవైపు గెజిట్‌లో పేర్కొన్న అంశాలు, అనుమతుల్లేని ప్రాజెక్టులు, వాటికి రుణాలు, గెజిట్‌తో ఏర్పడే పరిణామాలపై పార్లమెంట్‌లో వరుస ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా అనుమతుల్లేవని చెబుతున్న గోదావరి, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, నాబార్డ్‌ల రుణాలపై ఇప్పటికే ప్రశ్నలు లిస్ట్ అయ్యాయి. ఈ ప్రశ్నలపై కేంద్ర జల్‌శక్తి శాఖ రాష్ట్ర ఇరిగేషన్ ఇంజనీర్ల నుంచి సమాధానాలు కోరుతోంది. మరోపక్క ప్రాజెక్టుల అనుమతులు, వాటిపై ఖర్చు చేస్తున్న నిధులపై సమాచారం కోరుతూ కుప్పలు కుప్పలుగా ఆర్టీఐ దరఖాస్తులు వస్తున్నాయి. ఇంకోపక్క రుణాలు ఇస్తున్న బ్యాంకులు, ఇతర రుణ సంస్థలన్నీ అనుమతుల్లేని ప్రాజెక్టులు, వీటికి అనుమతుల సాధనలో రాష్టాన్రికి ఉన్న ప్రణాళికపై వరుస లేఖలు రాస్తున్నాయి. మొత్తంగా నదీజలాల విషయంలో స్పష్టత రావాలన్న పట్టుదలతో సిఎం కెసిఆర్ ఉన్నట్లు స్పష్టం
అవుతోంది.