నదుల అనుసంధానానికి ఎపి ముందడుగు
అదేపనిగా విమర్శలు చేస్తే ప్రజలు పట్టించుకోరు
జగన్ తీరు సరికాదన్న టిడిపి
విజయవాడ,ఆగస్ట్29(జనం సాక్షి): అభివృద్ది కార్యక్రమాలను విమర్శించడం, అడ్డుకోవడం వల్లనే వైకాపా అధినేత జగన్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గిందని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. విపక్షం అన్నాక విమర్శుల చేయవచ్చని, అయితే అదేపనిగా అన్నింటినీ విమర్శించడమే లక్ష్యంగా వైకాపా అధినేత జగన్ ఉన్నారని అన్నారు. అందుకే ప్రజలు ఆయనంటనే ఛీదరించుకునే పరిస్తితి ఏర్పడిందన్నారు. అదేపనిగా సిఎం చంద్రబాబును విమర్శించి భంగపడ్డారని అన్నారు. నదుల అనుసంధనాం, పట్టిసీమ,పురుషోత్తమ పట్నం వంటివి రైతుకలు ప్రయోజనం చేకూరుస్తున్నాయని అన్నారు. వీటిని కూడా విమర్శించడం దారుణమని అన్నారు. గోదావరి- కృష్ణా నదులను అనుసంధానం చేసినట్లే.. కృష్ణా- పెన్నా నదులను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారని తెలిపారు. దేశంలో మొట్టమొదట నదుల అనుసంధానం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కిందని అన్నారు. దీంతో రాష్ట్రం సస్యశ్యామలమవ్వడంతో పాటు తాగు, సాగు నీటి కొరత తీరుతుందని పేర్కొన్నారు. ఎర్రకాలువ వరదలొచ్చినప్పుడు పోలవరం కుడి కాలువకు వరదనీటిని మళ్లించి పంటలు నీటమునగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలావుంటే మెట్ట ప్రాంతంలో ఒక్క ఎకరం పంట కూడా ఎండకుండా తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎండిపోతున్న పొలాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో చెరువులకు నీరు పంపేలా పోలవరం కాలువ నుంచి మోటార్లను ఏర్పాటు చేశారని అన్నారు. పంటలు బాగా పండి ప్రతిరైతు ఆనందంగా ఉండాలనే లక్ష్యంతోనే చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నదుల అనుసంధానం పేరుతో రాయలసీమకు కూడా నీరు తీసుకెళ్లిన ఘనత ఆయనదేనన్నారు.