నన్‌ ఆర్‌ వన్‌కు చైనా స్వస్తి

e13-796

హైదరాబాద్‌,అక్టోబర్‌29(జనంసాక్షి):

దశాబ్దాలుగా చెయనాలో అమలులో ఉన్న ‘ఒక జంటకు ఒకే బిడ్డ’ విధానాన్ని ఇక నిలిపివేయాలని చెయనా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ మీడియా ఈ రోజు వెల్లడించింది. ఇక నుంచి చెయనాలో ఇద్దరు పిల్లల్ని కనడానికి అధికార కమ్యునిస్టు పార్టీ అనుమతినిచ్చిందని తెలిపింది. చెయనాలో పెరుగుతున్న జనాభాను అదుపు చేసేందుకు ఒకే బిడ్డ విధానాన్ని 1979 నుంచి అమలులోకి తెచ్చింనదని చెప్పింది. అయితే జనాభాలో ఇప్పుడు వృద్ధుల సంఖ్య అధికమవుతుండటంతో ఈ విధానాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.