నర్సంపేటలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన… వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. హరీష్ రావు…

ఫోటో రైటప్: శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీష్ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు..

నర్సంపేట: సెప్టెంబర్ 28 (జనం సాక్షి)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందించడానికి చేస్తున్న కృషిలో భాగంగా గురువారం వరంగల్ జిల్లా నర్సంపేటలో 138 కోట్లతో నిర్మించబోవు వైద్య విద్యా కళాశాలకు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు.
నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో జిల్లా ఆసుపత్రి పనులు జరుగుచుండగా నూతనంగా మంజూరైన మెడికల్ కళాశాల శంకుస్థాపన కోసం రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి పాకాల రోడ్డులో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం 183 కోట్ల వ్యయంతో నిర్మించే వైద్య కళాశాలకు మంత్రి హరీష్ రావు మంత్రులు దయాకర్ రావు సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 33 కోట్ల వ్యయంతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ సెంటర్ శంకుస్థాపన చేశారు. అనంతరం నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. గృహలక్ష్మి అనుమతి పత్రాలు, ,