నర్సంపేట్ మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం
ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకల నిర్వహణకు ఆదేశాలు
వరంగల్,అగస్ట్6(జనం సాక్షి)): నర్సంపేట్ మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బర్త్ డే వేడుకలను మున్సిపల్ కౌన్సిల్ ఆఫీస్‌లో నిర్వహించేందుకు కమినషర్ సర్క్యులర్ ఇచ్చారు. గౌరవ కౌన్సిల్ సభ్యులు వీలు చేసుకొని తప్పనిసరిగా వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానాలు పంపారు. నర్సంపేట్ మున్సిపాల్టీ కవిూషనర్ 5 వ తేదీన ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదం అయ్యాయి. ఇవాళ తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి. ఆయనకు కనీస మర్యాదగా… నివాళులర్పించేందుకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలన్న సోయి కూడా
లేకుండా… అధికార పార్టీ ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలను మున్సిపల్ ఆఫీసులో నిర్వహించేందుకు సర్య్కులర్ ఇవ్వడం ఏంటని విమర్శలొస్తున్నాయి. కమిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల లీడర్లు. ఉన్నతాధికారులు వెంటనే నర్సంపేట మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.