నర్సింగ్‌ కాలేజీకి 3.37 కోట్లు నిధులు మంజూరు

కరీంనగర్‌, డిసెంబర్‌ 2 : జిల్లాలో జనరల్‌ నర్సింగ్‌, మిడ్‌వైపరీ స్కూల్‌ నర్సింగ్‌ కాలేజీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 3.37 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ ఆదివారం తెలిపారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్రానికి నాలుగు నర్సింగ్‌ కాలేజీలు మంజూరు కాగా అందులో కరీంనగర్‌ ఒకటని తెలిపారు. 2012-13వ సంవత్సరానికి మంజూరు అయిన నర్సింగ్‌ కాలేజీని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపి తెలిపారు.