నలుగురు అటవీ ఉద్యోగుల సస్పెన్షన్
కడప,సెప్టెంబర్26(జనంసాక్షి): ఎర్రచందనం దుంగల చోరీ ఘటనకు సంబంధించి కడప జిల్లాలో నలుగురు ఉద్యోగులపై అటవీశాఖ వేటు వేసింది. ఈ నెల 24న బద్వేలు అటవీశాఖ కార్యాలయంలోని గోదాములో చోరీ జరిగిన నేపథ్యంలో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. బ్రాహ్మణప్లలె సెక్షన్ అధికారి వెంకటరమణ, ఎఫ్‌బీవోలు నారాయణస్వామి, శాంతి ప్రసన్న, జాకీర్ హుస్సేన్‌ను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. రూ.20లక్షల విలువైన 18 ఎర్రచందన దుంగల చోరీ వెనుక ఎవరి పాత్ర ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.