నలుగురు వ్యక్తులు గల్లంతు
పనాజీ,జూలై28(జనంసాక్షి ): వంతెనపై వేగంగా వస్తున్న ఓ కారు నదిలోకి దూసుకెళ్లిన దుర్ఘటన గోవాలోగురువారం జరిగింది. దక్షిణ గోవా జిల్లాలోని జువారి నది వంతెనపై నుంచి వస్తున్న కారు ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయింది. నదిలో పడిన కారును ఓ మహిళ నడుపుతోందని, కారులో నలుగురున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.ఇండియన్ కోస్ట్ గార్డ్స్, నేవీ, అగ్నిమాపకశాఖ, ఎమర్జెన్సీ సర్వీసుల శాఖ, గోవా పోలీసులు కలిసి నదిలో పడిన వాహనంతోపాటు అందులో ఉన్న వారిని వెలికి తీసేందుకు గాలింపు చేపట్టారు.నలుగురు వ్యక్తులు గల్లంతు