నల్గొండ పట్టణం లో ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ర్యాలీ,భారీ ఎత్తున పాల్గొన్న విద్యార్థులు,మహిళలు,ఉద్యోగులు,ప్రజలు

విద్యార్థులు,మహిళలు,ఉద్యోగులు,ప్రజలు
నల్గొండ బ్యూరో. జనం సాక్షి .
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖర రావు సారథ్యం లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లో ముందుకు వెళుతున్నట్లు నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు శుక్రవారం పట్టణంలో ఘనంగా జరిగాయి.
లక్ష్మి గార్డెన్ నుండి ఎన్.జి.కళాశాల వరకు విద్యార్థులు,మహిళలు,ప్రజలు,ఉద్యోగులు జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు . ర్యాలీ లో సుమారు 25 వేల మంది పాల్గొన్నారు ర్యాలీ అనంతరం ఎన్ .జి.కళాశాల మైదానం లో శాసనసభ్యుల అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ భారత యూనియన్ లో హైద్రాబాద్ సంస్థానం కలిసి 74 సం.లు పూర్తి అయి 75 సం.లకు అడుగిడిన సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఇటీవలనే స్వతంత్ర భారత వజ్రోత్సవాలను 15 రోజులు ఘనంగా నిర్వహించు కున్నట్లు తెలిపారు. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం , అనేకమంది త్యాగాల అనంతరం ముఖ్యమంత్రివర్యుల సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత ఎనిమిదేళ్లలో అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించామని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్,రైతుకు ఎకరాకు పెట్టుబడి సాయంగా 10 వేల రూ.లు రైతు బంధు,రైతు చనిపోతే 5 లక్షలు కుటుంబం కు చెల్లించేలా రైతు భీమా, ప్రతి ఇంటికి త్రాగునీరు, రైతులకు కోట్లాది ఎకరాలకు సాగునీరు, దళితులకు దళిత బంధు, మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ ,యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ అనేక సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తున్నదని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు నెర్రలు బారిన నేలలు,నీరు లేక మోటర్లు కాలిపోయి,రైతులు అప్పుల బాధ తో ఇబ్బందులు పడే వారని అన్నారు.నీళ్ళు,నిధులు,నియామకం కోసం తన ప్రాణాలు ఫణం గా పెట్టి ముఖ్యమంత్రి ,నాటి ఉద్యమ నేత కె.చంద్ర శేఖర్ రావు నాయకత్వం లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రం లో ప్రతి కుటుంబం చిరు నవ్వుతో సంతోషంగా వుండాలని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.బడుగు బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందించేందుకు గురుకుల పాఠశాలలు నెలకొల్పినట్లు,6 లక్షల విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో విద్య అభ్యసిస్తున్నారని,ఒక్కొక్క విద్యార్థిపై లక్ష 20 వేల రూ.లు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం అభివృద్ది లో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని అన్నారు.జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ననుసరించి ఈ నెల 16 నుండి 18 వరకు మూడు రోజుల పాటు జాతీయ సమైక్యతా వజ్రొత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్ర వారం జిల్లాలో ఆరు నియోజక వర్గ కేంద్రాల్లో 15 వేల మంది విద్యార్థులతో ర్యాలీ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నల్గొండ పట్టణం లో ర్యాలీ లో విద్యార్థులు,అడ్వకేట్ లు,మహిళలు,ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని,ప్రతి ఒక్కరూ తమ వంతు గా అభివృద్ధి కి పాటు పడాలని అన్నారు.రేపు జిల్లాలో ని మండల కేంద్రం ల నుండి హైద్రాబాద్ లో నిర్వహించే గిరిజన సమ్మేళనం కు ఎస్.టి.ప్రజా ప్రతినిధులు,ఉద్యోగులు తరలి వెళుతున్నట్లు తెలిపారు. ఎస్.పి. రెమా రాజేశ్వరి మాట్లాడుతూ ఎన్నో త్యాగాల ఫలితంగా రాష్ట్ర సాధన జరిగిందని,స్వరాష్ట్రం లో విద్య,ఉపాధి ద్వారా ప్రతి ఒక్కరూ సంపూర్ణ వికాసం చెందుతూ రాష్ట్ర అభివృద్ధి కి పునరంకితం కావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ మందడి సైది రెడ్డి,వైస్ చైర్మన్ అబ్బ గొని రమేష్,
డి ఆర్ డి ఓ కాళిందిని, ఆర్డీవో జగన్నాథ రావు, వివిధ మండలాల జడ్పిటిసిలు ఎంపీటీసీలు ఎంపీపీలు సర్పంచులు స్థానిక ప్రజాప్రతినిధులు నియోజకవర్గ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు,ఉద్యోగులు,అడ్వకేట్ లు తదితరులు పాల్గొన్నారు.