నల్లబ్యాడ్జీలతో ఎన్టీపీసీ ఉద్యోగుల నిరసన

కరీంనగర్‌ గోదావరిఖని: దేశ వ్యాప్త సమ్మెను పురస్కరించుకుని ఎన్టీపీసీ ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా బుధ.గురువారాల్లో 48 గంటల సమ్మెకు సంఘీఖావంగా నల్లబ్యాడ్జీలు ధరించారు. దేశం మొత్తం మీద అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ విధానాలను నిరసించారు.