నల్సార్ అడ్మిషన్‌కు కెటిఆర్ ఆర్థిక సాయం
యువతి అభ్యర్థనకు తక్షణం స్పందించిన మంత్రి
హైదరాబాద్,ఆగస్ట్5( జనంసాక్షి): ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకునే గొప్ప ఆపద్భాందవుడు కేటీఆర్. అలా ట్వీట్ చేస్తే.. ఇలా స్పందించి.. అండగా నిలిచే గొప్ప మనసున్న మహానుభావుడు కేటీఆర్. సరస్వతి పుత్రికల పాలిట దేవుడై దర్శనమిస్తున్న కేటీఆర్ సార్‌కు సెల్యూట్ అంటూ ఓ యువతి ట్వీట్ చేసింది.
అంతగిరి హరిప్రియ అనే విద్యార్థిని నల్సార్ యూనివర్సిటీ నిర్వహించిన లా ఎంట్రెన్స్ టెస్టు రాసింది. అందులో ఆమె మెరుగైన ర్యాంకు సాధించడంతో యూనివర్సిటీలోనే బీఏ ఎల్‌ఎల్‌బీలో ప్రవేశం పొందింది. కానీ అడ్మిషన్ కావడానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో తనకు ఆర్థిక సాయం చేయాలని హరిప్రియ ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌ను అభ్యర్థించింది. తన నాన్న దినసరి కూలీ అని తన గోడును వెల్లబోసుకుంది.
హరిప్రియ ట్వీట్‌పై కేటీఆర్ తక్షణమే స్పందించారు. హరిప్రియ సాధించిన విజయానికి శుభాకాంక్షలు తెలుపుతూ కేటీఆర్ రీట్వీట్ చేశారు. తప్పకుండా సహాయం చేస్తానని కేటీఆర్ హావిూ ఇచ్చారు. ఈ క్రమంలో హరిప్రియతో ఆమె కుటుంబ సభ్యులను కేటీఆర్ గురువారం కలిసి ఆర్థిక సాయం అందించారు. దీంతో హరిప్రియ.. కేటీఆర్ సార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది. సార్.. విూ సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. విూ విలువైన సమయాన్ని తమకు కేటాయించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. విూరందించిన ఆర్థిక సాయం తన చదువుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విూ టీమ్‌కు కూడా ప్రత్యే కృతజ్ఞతలు. వారు తనను వెన్నంటి ఉండి.. అడ్మిషన్ ప్రాసెస్‌ను దగ్గరుండి చూసుకున్నారు. 24 గంటల్లోనే తన సమస్యను పరిష్కరించారు.. విూతో పాటు విూ టీమ్ సభ్యులకు సెల్యూట్ చేస్తున్నానని హరిప్రియ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్.. హరిప్రియకు సాయం చేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది.. గుడ్ లక్ అంటూ ట్వీట్ చేశారు.