నవంబర్‌ 1న విద్రోహదినంగా..

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 9: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బహిష్కరించి నవంబర్‌ 1వ తేదీని విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ రైతుల వేదిక పిలుపునిచ్చింది. నవంబర్‌1న జరిగే కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొనకూడదని ప్రజల అందరూ నల్ల జెండాలు ఎగరవేసి నిరసన వ్యక్తం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరిశంకర్‌ పేర్కొన్నారు. తెలంగాణలోని పలు జిల్లాలో ప్రజాప్రతినిధులు మంత్రులు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశాయి. నవంబర్‌1న  తెలంగాణ ప్రజలు అందరూ తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి ప్రతిజ్ఞన చేయాలని కోరారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలపై విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించాలని అన్నారు. రాజకీయా లకు అతీతంగా అందరిది ఒకే మాట, ఒకే బాట తెలంగాణ లక్ష్యసాధనగా ముందుకు రావాలని ఆయన సూచించారు. సీమాంధ్ర నేతల ఆదిపత్యం కోసం ట్యాంక్‌బండ్‌పై తిరిగి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి తెలంగాణపై ఎలాంటి ప్రేమ ఉన్న తెలంగాణ  కోసం పోరాడి అసువులుబాసిన వారి విగ్రహాలను నెలకొల్పాలని డిమాండ్‌ చేశారు.