నష్టపోయిన ఖరీఫ్ రైతులకు భీమా పరిహారం
ఆదిలాబాద్ ,జూలై 20: జిల్లాలో గత ఖరీప్‌లో పంటలు నష్టపోయిన రైతులకు భీమా పథకం కింద నష్టపరిహారం చెల్లించేందుకు 11.48 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. జిల్లాలో పత్తి పంటకు వాతావరణాధారిత భీమా, సోయాకు గ్రామ యూనిట్ పథకం కింద, ఇతర పంటలకు మండల యూనిట్ కింద అమలు చేస్తున్న భీమా పథకం ప్రీిమియం కంద డబ్బులు చెల్లించారు. జిల్లాలో గత ఖరీఫ్‌లో 5.30 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా వర్షాభావ పరిస్థితిల వల్ల దిగుబడి రాక రైతులు పంటలు నష్టపోయారు. దీంతో ప్రభుత్వం జిల్లాలోని 52 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించింది. దీంతో ప్రభుత్వం నష్టపరిహాకం కింద 190 కోట్ల రూపాయల మంజూరు చేసింది. దీంతోపాటు భీమా ప్రీిమియం చెల్లించిన రైతులకు పరిహారం మంజూరు కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భీమా పరిహారం జిల్లాలో 50 వేల 50 మంది రైతులకు అందనున్నది.