నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి-బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథరావు
దండేపల్లి. జనంసాక్షి. ఆగస్టు 04 ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ప్రాంతంలో నీట మునిగిన పంట చేన్ల రైతుల ప్రతి ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాలని గురువారం దండేపల్లి మండల కేంద్రంలో బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఎర్రవెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసి రైతులు నష్టపోయిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కడెం ప్రాజెక్టు వైపు తొంగి చూడలేదు అని మండిపడ్డారు ఇప్పటికైనా కెసిఆర్ కడెం ప్రాజెక్టును సందర్శించాలని డిమాండ్ చేశారు రైతులకు ఇచ్చిన హామీల ప్రకారం కడెం ప్రాజెక్టు పనులు అతి త్వరలోనే పూర్తి చేసి కడెం ఆయకట్టు కింద ఉన్న వేలాది ఎకరాల పంట పొలాలకు నీరు అందించి రైతులను ఆదుకోవాలని అన్నారు ఈ నెల ఆఖరి వరకు నీరు అందకపోతే ఆయకట్టు కింద ఉన్న రైతులతో ధర్నాలు రాస్తారోకోలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని అన్నారు ఇప్పటి వరకు అధికారుల తో పంట నష్టం సర్వే చేయకుండా రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. వేల ఎకరాల పంట నష్టం జరిగిన, కడెం ప్రాజెక్టు, గూడెం సత్యనారాయణ స్వామి లిఫ్ట్ కు నష్టం జరిగిన ముఖ్యమంత్రి జిల్లాను సందర్శించక పోవడం జిల్లా రైతల పట్ల వివక్ష చూపడమే అవుతుంది అని అన్నారు. గూడెం లిఫ్ట్ కు సరైన డిజైన్ చేయకపోవడం వల్ల ఈరోజు జిల్లాలో వేల ఎకరాలకు పంట నష్టం జరిగింది అని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంట నష్టం సర్వే చేసి ఎకరాకు 50 వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని అని అన్నారు మరియు కడెం ప్రాజెక్టు సందర్శించి ప్రాజెక్టుకు మరమ్మత్తులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి చివరి ఆయకట్టుకు సాగు నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గూడెం లిఫ్ట్ మరమ్మత్తులు కూడా త్వరగా పూర్తి చేసి పంటలకు నీరు అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు గోపతి రాజయ్య, నాయకులు బొలిషెట్టి తిరుపతి, బోప్పు కిషన్, రజినిష్ జైన్, జీవి ఆనంద్ కృష్ణ, గుండా ప్రభాకర్, మారినేని రాజేశ్వరి, బందేల రవి గౌడ్, గుండం రాజలింగు, కర్ణల కిషన్, బండే సత్యం, సిపిరిశెట్టి శ్రీనివాస్, గుండా రవీందర్, బోర్లకుంట వెంకటేష్, నందుర్జ సుగుణ, బొడకుంట శ్రీధర్, చెరుకు హరీష్, రాజ్ కుమార్, తాల్లపల్లి వంశీ, ముత్యాల శ్రీనివాస్, సంజీవ్, చండేశ్వర్, రత్నం తిరుపతి, వెంకటేష్, శ్రీకాంత్, కంది రమేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.