నాంపెల్లి, సిరిసిల్ల ఎన్నికలు నిలిపివేత

కరీంనగర్‌, ఫిబ్రవరి 1 (): సహకార సంఘం సొసైటీలకు జరిగిన ఎన్నికల్లో రుద్రారం, వేములవాడ, నాంపెల్లి, సిరిసిల్ల ప్రాంతాల్లో చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ప్రాంతంలోని సొసైటీల్లో నాంపెల్లి, సిరిసిల్ల సొసైటీలకు చెందిన డైరెక్టర్లు, టిఆర్‌ఎస్‌కు చెందిన వ్యక్తులు రహస్యంగా ఉంచడంతో ఈ రెండు సొసైటీల ఎన్నికలను నిలిపివేశారు. కాగా గంబీరావుపేటలోని ఐదవవార్డుకు చెందిన అంజవ్వ, సిరిసిల్ల సొసైటీ డైరెక్టర్‌ పద్మలను కూడా రహస్య ప్రదేశంలో దాచారని తెలియడంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో టిఆర్‌ఎస్‌కు చెందినవారు మరికొన్ని చోట్ల కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తులను దాచి ఉంచడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీలే సొసైటీలను స్వాధీనం పర్చుకోవాలన్న ఆలోచనతో రహస్య సమావేశాలు జరుపుతున్నారని తెలిసింది.