నాగం భరోసా యాత్ర ప్రారంభం

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ ఉద్యమమే ఎజెండాగా పనిచేస్తానని చెప్పిన తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్థన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు. పాలమూరులోని ఉమామహేశ్వరంలో పూజలు చేసి అచ్చంపేట నుంచి యాత్ర ప్రారంభించారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్‌ కోదండరాం, భాజాపా నేత దత్తాత్రేయ మద్దతు ప్రకటించి యాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమమే ధ్యేయంగా తెలంగాణ జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ విషయంలో 700 మందికి పైగా విద్యార్థులు, యువకులు బలిదానం చేసుకున్నా సర్కారులో చలనం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ సాధించేవరకు మా పోరాటం ఆగదని చెప్పారు.