నాగపూర్ లో మళ్లీ లాక్ డౌన్
మహారాష్ట్రలో కరోనా మహా ముప్పు
రోజులుగా 10వేలకు పైగా నమోదవుతున్నాయి. బుధవారం ఆ సంఖ్య 13,659కి చేరింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ప్రధాన నగరాలైన ముంబయిలో 1,539, పుణెలో 1,384, నాగ్‌పూర్‌లో 1,513, నాసిక్‌లో 750, యావత్మల్‌లో 403, ఔరంగాబాద్‌లో 560, పింప్రిచించ్వాడ్‌లో 590 కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనాను కట్టడిచేసేందుకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఏడు పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. వేగవంతమైన కాంటాక్ట్ ట్రేసింగ్, హాట్ స్పాట్స్‌లో మాస్ టెస్టింగ్, వైరస్ సోకినవారి సన్నిహితులను పరీక్షించడం వంటివి ఆ ప్రణాళికలో భాగం. అన్ని జిల్లా యంత్రాంగాలు వాటిని పాటించాలని ఇదివరకే ఆరోగ్య శాఖ ఆదేశించింది.రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిని కట్టడి చేసేందుకు కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ‘రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించనున్నాం. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఇంకా అదుపుతప్పలేదు. కొన్ని ప్రాంతాల్లో కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలు విధిస్తాం. వాటిపై నిర్ణయం తీసుకోనున్నాం’ అని ఆయన అన్నారు. ముంబయిలోని జేజే ఆసుపత్రిలో టీకా మొదటి డోసు తీసుకున్న అనంతరం ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. టీకా తీసుకునేందుకు ఎవరు సంకోచించవద్దని..అర్హులంతా టీకా తీసుకోవాలని ఆయన సూచించారు. వైద్య సిబ్బంది ఆయనకు కొవాగ్జిన్ టీకా ఇచ్చారు.దేశంలో వెలుగుచూస్తోన్న రోజువారీ కేసుల్లో ఎక్కువ భాగం..మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడులోనే నమోదు కావడం గమనార్హం. తాజా కేసుల్లో 85.91 శాతం కేసులు ఈ రాష్ట్రాల్లోనే వెలుగుచూశాయని గురువారం కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 22,854 కొత్త కేసులు వెలుగుచూశాయని తెలిపింది. సుమారు రెండు నెలల తరవాత ఈ స్థాయి కేసులు బయటపడ్డాయి. 126 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.