నాపై రాజకీయ కుట్ర నన్ను మారిస్తే ఏం కాదు :బోత్స
హైదరాబాద్ : తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం అన్నారు. తనపై కథనం వచ్చిన అంగ్ల దినపత్రికపై తాను పరువు నామినేటెడ్ అభ్యర్థినని తనను మార్చినంత మాత్రాన ఏమీ జరగదన్నారు. కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ తనకు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా లేఖ రాసినట్లు తనకు తెలియదన్నారు.
అలేఖను చూడలేదన్నారు. తనకు తెలిసి అవన్నీ ఊహజవిత కథనాలే అన్నారు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం బాగా పని చేస్తోందన్నారు. కోందరు కుట్రపూరితంగా పార్టీని ప్రభుత్వాన్ని దెబ్బతీసి ప్రయత్నాలు చేస్తున్నారని అరోపించారు. జాతీయ సమైక్యతను కాపాడగలిగేది కేవలం కాంగ్రెసు పార్టీ మాత్రమే అన్నారు. కిషోర్ చంద్రదేవ్ లేఖ వెనుక కుట్ర దాగి ఉందన్నారు. తన ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తనను మాఫియా డాన్‌తో పోల్చిన పత్రికపై చర్యలు తీసుకుంటానని చెప్పారు.. తన కూతురు వివాహన్ని కూడా రాజకీయం చేస్తున్నారని బొత్స అవేదన వ్యక్తం చేశారు. కాగా గాంధీ భవనంలో కెవిపి రామచంద్ర రావుతో బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ ముఖ్యమంత్రి పిసిసి చీఫ్‌లకు వ్యతిరేకంగా తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖరాసి ఉంటారనితాము భావించడం లేదని మంత్రికోండ్రు మురళీమోహన్ అన్నారు. 2014 వరకు ప్రభుత్వం కోనసాగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో తాము 174 అసెంబ్లీ స్థానాలు గెలుపోందుతామని అయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మరో రెండు వైద్య కళాశాలలు వచ్చాయని చెప్పారు.