నారాయణాఖేడ్ పట్టణంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యజమానులు

ప్రవేట్ పాటశాల ముందు బుధవారం రోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య అద్యర్యంలో ధర్నా అనంతరం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని, విద్యా వ్యాపారన్ని ఆపలి
నారాయణఖేడ్ పట్టణ శివారులో నూతనంగా ప్రారంభించిన ఈ తక్షిలా ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు మోయలేని విధంగా అధిక ఫీజులు ఉన్నాయని, వెంటనే ఫీజులను తగ్గించాలంటూ బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాల ముందు నిరసన తెలిపారు. ఈసందర్భంగా సంఘం నాయకులు కుమార్ మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాల పేరుతో ఈ తక్షిలా యాజమాన్యం విద్యార్ధుల నుండి అధిక ఫీజులు దండుకుంటున్నారు అన్నారు. నర్సరీకి ఏడాదికి రూ, 32000లు ఫీజు, బస్సు ప్రయాణ చార్జీలు, సంగీతం, నృత్యం పేరుతో అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు అన్నారు. పాఠశాలకు కేవలం 7వ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉండగా 8 మరియు 9 తరగతులు కొనసాగిస్తున్నారు అన్నారు. ఇప్పటికైనా నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని అందరికి ఆమోదయోగ్యమైన ఫీజులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం బాద్యులు పాల్గొన్నారు.