నాలుగు నెలల తర్వాత భూమికి సునీతా విలియమ్స్‌

హోస్టన్‌ : నాలుగు నెలల పాటు అంతరిక్షంలో ఉన్న భారత – అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ సోమవారం ఉదయం ఏడున్నర గంటలకు కజకిస్తాన్‌లో భూమి పైకి దిగారు. సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు ఈ ఉదయం క్షేమంగా భూమికి చేరుకున్నారు.

అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన మొదటి వ్యోమగామిగా సునీతా విలియమ్స్‌ నిలిచారు. రష్యా సోయజ్‌ కమాండర్‌ యూరీ మాలెస్‌ చెంకో, జపాన్‌కు చెందిన అకీ హోపీడేలతో కలిసి సునీత కజకిస్తాన్‌లోని అర్కలిక్‌ పట్టణ సమీపంలో ఉదయం సోయజ్‌ టిఎంఏ-05 నౌకలో భూమిపైన అడుగుపెట్టారు. 33వ అంతరిక్ష యాత్ర చేపట్టిన వీరు ముగ్గురు 127 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. జూలై 15వ తేదీన వారు అంతరిక్షంలోకి వెళ్లారు. అంతరిక్ష కేంద్రానికి సేవలు అందించారు. శనివారం ఐఎన్‌ఎన్‌ నాయకత్వ బాధ్యతలు లాంచనంగా కెవిన్‌ ఫోర్ట్‌ అనే మరోవ్యోమగామికి అప్పగించారు.

హోస్టన్‌ : నాలుగు నెలల పాటు అంతరిక్షంలో ఉన్న భారత – అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ సోమవారం ఉదయం ఏడున్నర గంటలకు కజకిస్తాన్‌లో భూమి పైకి దిగారు. సునీతా విలియమ్స్‌తో పాటు మరో మెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ సోమవారం ఉదయం ఏడున్నర గంటలకు కజకిస్తాన్‌లో భూమి పైకి దిగారు. సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు ఈ ఉదయం క్షేమంగా భూమికి చేరుకున్నారు.