నాలుగేళ్లుగా మతపరమైన హింసాకాండ
ప్రధాని మోడీపై శశిథరూర్ మండిపాటు
తిరువనంతపురం,ఆగస్ట్6(జనం సాక్షి ): ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ విమర్శలు గుప్పించారు. ముస్లింలు ధరించే టోపీని మోదీ ధరించేందుకు ఎందుకు నిరాకరిస్తుంటారని ప్రశ్నించారు. అన్ని రకాల దుస్తులు వేసుకునేందుకు ఇష్టపడే మోదీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు ఎందుకు వేసుకోరని కూడా నిలదీశారు. తిరువనంతపురంలో కేరళ పీసీసీ ఆధ్వర్యంలోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డవలప్‌మెంట్ స్టడీస్ నిర్వహించిన ఓ సెమినార్‌కు హాజరయ్యేందుకు వచ్చిన శశిథరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత నాలుగేళ్లుగా మతపరమైన హింసాకాండ ఘటనలు, గోసంరక్షుల పేరుతో హత్యలు పెరిగిపోయాయంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శశిథరూర్ నిప్పులు చెరిగారు. ¬ం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గత నాలుగేళ్లలో 2,920 మత హిసాంకాండలు చోటుచేసుకున్నాయని, 389 మంది ప్రాణాలు కోల్పోగా, లెక్కలాది మంది గాయపడ్డారని అన్నారు. మోదీ బహిరంగంగా ఎలాంటి ఖండన ప్రకటనలు చేయనందునే ఇలాంటి హింసాకాండలు, కొట్టిచంపడాలు వంటివి నానాటికి పెరిగిపోతున్నాయన్నారు. అనంతరం జరిగిన సెమినార్‌లో సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ సైతం
మోదీపై నిప్పులు చెరిగారు. మోదీ, అమిత్‌షా కలిసి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని విమర్శించారు. మోదీ అడాల్ఫ్ హిట్లర్ తరహాలో ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని, హిట్లర్ సైతం ప్రజాస్వామ్యంతోనే అధికారంలోకి వచ్చారు కానీ, ఆర్మీ తిరుగుబాటు ద్వారా కాదని గుర్తు చేశారు.