నాలుగో బంతికి అవుటయ్యే ప్రమాదం నుండి బతికారు
సిడ్నీ: ఆస్ట్రేలియా నిర్దేశించిన 329 పరుగుల భారీ టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన టీమిండియా తొలి ఓవర్ లోనే వికెట్ కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ నాలుగో బంతికి అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.స్టార్క్ బౌలింగ్ లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్ వాట్సన్ పట్టుకున్నాడు. బంతి నేలకు తాకినట్టు రీప్లేలో కనబడింది. అన్నికోణాల్లో పరిశీలించిన తర్వాత థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించడంతో రోహిత్ శర్మ ఊపిరి పీల్చుకున్నాడు. తర్వాత బంతికి రోహిత్ ఫోర్ బాదాడు. ఇక 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధావన్ ఇచ్చిన క్యాచ్ ను వికెట్ కీపర్ హాడిన్ వదిలేయడంతో అతడికి లైఫ్ లభించింది. టీమిండియా 4 ఓవర్లలో 15/0 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.