నా ఆర్థిక పరిస్థితే జట్టు నుంచి బయటకు రప్పించింది!

k5mpduqfనాటింగ్ హమ్: తన ఆర్థిక పరిస్థితే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పేలా చేసిందని మాజీ జింబాబ్వే ఆటగాడు బ్రెండెన్ టేలర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరైనా దేశపు చొక్కా ధరించి క్రీడలు ఆడటాన్ని గర్వంగా భావిస్తారు.కానీ తన ఆర్థిక పరమైన స్థితి గతులు క్రీడా జీవితాన్ని వెనక్కి నెట్టేలా చేశాయన్నాడు. గురువారం క్రికెట్ . కామ్ కు ఇచ్చిన ఇంటూర్యూలో టేలర్ తన గత అనుభవాలను పంచుకున్నాడు.

‘ వరల్డ్ కప్ ముగిసే నాటికి నా దగ్గర ట్యాక్స్ లు  పోగా 250 ఆస్ట్రేలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా ఏ ప్రొఫెషన్ల ఆటగాడికైనా కాంట్రాక్ట్ పరంగా తొంబై అయిదు వేల డాలర్లకు పైగా ఉంటుంంది. మాకు ఆ పరిస్థితి అయితే లేదు. నన్ను ఆర్థిక పరిస్థితి బలవంతంగా ఇంగ్లిష్ కౌంటీలు ఆడేందుకు నడిపించింది.  నాటింగ్ షైర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న నాకు ఆర్థికపరమైన వెసులుబాటు కనబడుతోంది’ అందుకు అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్పాల్సి వచ్చిందన్నాడు. ఈ తరహా ఆర్థిక పరిస్థితి కారణంగా గతంలో(2013) యువ ఆటగాడు క్రెయిగ్ ఎర్విన్ జింబాజ్వే కాంట్రాక్టును బహిష్కరించిన సంగతి తెలిసిందే.