నా దేశం నా మట్టి కార్యక్రమంలో పాల్గొన్న బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాల మేరకు శుక్రవారం నా దేశం నా మట్టి కార్యక్రమాన్ని సైదాపూర్ మండల కేంద్రంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన స్వతంత్ర సమరయోధులను,దేశ భద్రత కోసం కోసం ప్రాణ త్యాగం చేసిన జవానులను,మన తెలంగాణలో తెలంగాణ విమోచన కోసం ప్రాణ త్యాగం చేసిన అనేకమంది వీరులను స్మరించుకుంటూ వారు పుట్టిన గడ్డ నుండి మట్టిని స్వీకరించి దేశ రాజధాని ఢిల్లీ లోని అమరవీరుల స్మ్రుతి వనానికి పంపడం జరుగుతుందన్నారు.సెప్టెంబర్ 6 నుండి 15 వరకు నా దేశము నా మట్టి కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యక్షులు మునిగంటి సంతోష్ బీసీ సెల్ అధ్యక్షులు నెల్లి శ్రీనివాస్ బిజెపి నాయకులు బైర శ్రీనివాస్,మద్ది పవన్,తంగల అశోక్,మడపు రాహుల్,కాయిత సన్ని,రంజిత్,సుదర్శన్,బన్నీ,గోపాల్ తదితరులు పాల్గొన్నారు.