నా దేశం నా మట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథి బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.
వీణవంక మండలంలోని హిమ్మత్ నగర్. మల్లారెడ్డిపల్లి రెండు గ్రామాలలో స్థానిక హనుమాన్ ఆలయం తో పాటు వరలక్ష్మి భూలక్ష్మి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఇంటింటికి తిరిగి మట్టిని సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొని వారు మాట్లాడుతూ అభివృద్ధి చెందిన భారతదేశమే లక్ష్యంగా, ప్రతి అంశంలో బానిసత్వం నుంచి విముక్తి, మన వారసత్వం పై గర్వం, ఐకమత్యం మరియు సంఘీభావం, ప్రజల్లో కర్తవ్యం భావన నెలకొల్పాలని ఆయన అన్నారు. గ్రామాలలో ఇంటి ఇంటికి మట్టి సేకరించి ఢిల్లీకి చేరేవరకు అన్ని మతాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామాలలో మట్టి సేకరించి పంపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి , జిల్లా కార్యదర్శి నరసింహ రాజు , కిసాన్ మోర్చ జిల్లా అధికార ప్రతినిధి సురేందర్ రెడ్డి సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి. సీనియర్ నాయకులు పెద్ది మల్లారెడ్డి .ఐటీ సెల్ కన్వీనర్ వినోద్ కుమార్. కిసాన్ మోర్చ జిల్లా కార్యదర్శి తిరుపతి రెడ్డి. బూత్ అధ్యక్షులు నాని. శ్రీనివాస్ రాజు. నాయకులు వీరాస్వామి. శ్రీనివాస్ రఘువరన్ తోపాటు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు