నా భర్తను కలుసుకోబోతున్నా: ధోని భార్య

నా భర్తను కలుసుకోబోతున్నా: ధోని భార్య
 రాంచీ: వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శన దేశం గర్వించేలా ఉందని భారత జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని భార్య సాక్షిసింగ్ ధోని పేర్కొంది. ‘ గొప్ప పోరాటం చేశారు. కొన్ని గెలిచారు, కొన్ని ఓడారు. మీ త్యాగం అమూల్యం. తర్వలోనే నా భర్తను కలుసుకోబోతున్నా’ అని ఆమె ట్వీట్ చేశారు.

బిజీ షెడ్యూల్ కారణంగా భారత ఆటగాళ్లు గత మూడు నెలలుగా ఆస్ట్రేలియాలోనే ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ నేపథ్యంలో ధోని తన పాపను చూడడానికి కూడా రాలేదు. రెండో సెమీస్ లో ఆసీస్ చేతిలో పరాజయం పాలైన భారత ఆటగాళ్లు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు.