నిజమైన కౌలుదారులకే రుణాలు
అమరావతి,జూలై20(జనం సాక్షి): సహకార సంఘాల అధ్యక్షులు స్థానికంగానే ఉంటున్న నిజమైన సాగు చేసే కౌలు రైతులను గుర్తించి వారికి ప్రభుత్వ ఉపకరణాలు అందేలా కృషి చేయాలని అధికారులు అన్నారు. కౌలురైతులకే రుణాలు మంజూరు చేసే అంశంపై ప్రభుత్వం సైతం సుముఖంగా ఉందని వివరించారు. పంట సాగు చేయని భూమి యజమానులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటుండటంతో నిజంగా సాగు చేసే కౌలు రైతు నష్టపోతున్నాడు. దీంతో ప్రభుత్వం అందించే పెట్టుబడి రాయితీ, బీమా, రుణ తదితర సదుపాయాలు కౌలు రైతులకు అందడం లేదు. పంటలు సాగు చేసే కౌలు రైతులకే నేరుగా రుణాలు మంజూరు చేస్తే.. 90శాతం వరకు భూమి యజమానులకు రుణాలు చేరవు. సహకార సంఘాల ద్వారా ఇస్తున్న రుణాల రికవరీలో సమస్యలు ఉన్నాయని కొందరు సహకార సంఘాల అధ్యక్షులు తెలిపారు. సాగు చేసిన పంటను స్థానిక సహకార సంఘాలకే విక్రయించేలా రైతులను పోత్సహించాలని మురళి సూచించారు.భూమి యజమానులకు కాకుండా నిజంగా పంట సాగు చేసే రైతులకు రుణాలు అందేలా తోడ్పాటు అందించాలని సూచించారు. సహకార వ్యవస్థలో రైతులకు సహకార సంఘాలు ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో రుణ మంజూరు పక్రియలో ఎదురయ్యే సమస్యలను పలువురు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
—————–