నిజాంను నిగ్గదీసిన కవి దాశరథి
నేడే దాశరథి కృష్ణమాచార్యుల 98వ జయంతి.
వరంగల్,జూలై22(జనం సాక్షి ): దాశరథి కృష్ణమాచార్య వరంగల్ జిల్లా మానుకోట తాలూకా చిన్నగూడూరు గ్రామంలో జూలై 22, 1925న జన్మించాడు. వెంకటమ్మ, వెంకటాచార్యులు ఆయన తల్లిదండ్రులు. తల్లి నుండి మానవత్వం, తండ్రి నుండి పాండిత్యం అతనికి చిన్ననాటి నుంచే ఒంటబట్టాయి…
‘ఓ నిజాము పిశాచమా! కానరాడు..నిన్ను బోలిన రాజు
మాకెన్నడేని..తీగలను తెంపి అగ్నిలోకి దింపినావు..
నా తెలంగాణ కోటి రత్నాల వీణ..
ఈ పద్యం వినని, తెలియని తెలంగాణావాడుండడు. ఒక్కోసారి అన్పిస్తుంది ఇలాంటి పద్యాలే కవులు రాయకపోతే తెలంగాణ ప్రాంతీయ స్పృహ అందరిలో పుట్టేదా? అని. అటువంటి పద్యాలు, వచనాలు ఎన్నో ఈనేలన పురుడు పోసుకున్నాయి. మానులై ఎన్నో విజయాలూ అందించుటలో సహకరించాయి. అలాంటి ఉద్యమ సాహిత్యం, అభ్యుదయ సాహిత్యంలో తెలంగాణా అనగానే సాధారణంగా గుర్తొచ్చే కవి దాశరథి కృష్ణమాచార్యులు.నిజాం నిరంకుశ పాలనను, భూస్వామ్య వ్యవస్థను, పెట్టుబడిదారి వ్యవస్థను, అన్యాయం, అధర్మం ఉన్న ప్రతి చోటా కవితాశక్‌ఖ్తె ధిరోదాత్తుడై కనిపించినవాడు దాశరథి. ఆయనలోని కవితాధార ఎందరో పీడిరచేవారిని గజగజ వణికించింది. అది అగ్నిధారై ప్రవహించింది. రుద్రవీణై వినిపించింది. అమృతాభిషేకం కురిపించి కవితా పుష్పకంలో వికసించింది. అట్లాంటి తెలంగాణా వైతాళికుడు దాశరథి. దగాకోరు బడాచోరురజాకారు పోషకుడవువూళ్ల కూళ్లు అగ్గివెట్టిఇళ్లన్ని కొల్లగొట్టిపెద్దరికం చేస్తావాదిగి పొమ్మని` దిగి పొమ్మని పదేపదే అనేస్తానుదిగిపోవోరు`తెగిపోవోరు‘ అంటూ నిజాంను నిలదీశాడు. తర్వాత అరెస్టయి నిజామాబాద్ జైల్లో బంధించబడినాడు. అయిననూ ఎక్కడా వెనుదిరగక అనేకనేక రచనలు నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ జైలు గోడలపై బొగ్గుతో రాసి మన తెలంగాణ మట్టి పౌరుషాన్ని అడుగడుగునా ప్రదర్శించిన అసలైన, నిఖార్సయిన తెలంగాణా కవి దాశరథి కృష్ణమాచార్యులు.