నిజాయితీకి పట్టం నియంతకు తుది గట్టం

వచ్చే ఎన్నికల్లో బిఅరెస్ పార్టీనే సస్పెండ్ చేయడం ఖాయం

హైకోర్టు ఆదేశాల మేరకు పదవి బాధ్యతలు చేపట్టిన పెద్దమందడి సర్పంచ్ వెంకట స్వామి

వనపర్తి బ్యూరో సెప్టెంబర్28 (జనంసాక్షి)

గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగం చేశాడన్న అభియోగంపై సస్పెండ్ అయిన వనపర్తి జిల్లా పెద్దమందడి గ్రామ సర్పంచ్ వెంకటస్వామి గురువారం తిరిగి సర్పంచుగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈయనను కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎన్నికల పరిశీలకురాలు మంజుల శాలువా, పూలమాలలతో సన్మానించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూకాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల మనసుల్లో ఉందని కాంగ్రెస్ పార్టీ అభినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రంను ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.ఎవరు ఎక్కడ భయపడరాదని కాంగ్రెస్ పార్టీ అనుక్షణం అందరినీ కాపాడుకుంటదని ఆమె భరోసా కల్పించారు.గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగం చేశాడన్న అభియోగంపై ఇటీవల వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి సర్పంచును సస్పెండ్ చేశారు.ఈ సస్పెండ్ ను సవాలు చేస్తూ సర్పంచ్ వెంకటస్వామి హైకోర్టును ఆశ్రయించారు
పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు స్టే ఆర్డర్ ను జారీ చేసింది.దాంతో గురువారం సర్పంచ్ తిరిగి తన పదవి బాధ్యతలను చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను ఎక్కడ కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని అధికారులు, అధికార పార్టీ నాయకులు తనపై ఉన్న కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని నిజాయితీగా పనిచేసిన తనను ఎవరు కూడా ఏం చేయలేరని పేర్కొన్నారు
రాత్రికి రాత్రి జీవోలను పాస్ చేయించి తమతో పనులు చేయించారన్నారు.
అధికారుల ఆదేశాల మేరకే తాను గ్రామపంచాయతీ నిధులను ఉపయోగించానని.
ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కాకపోయినా తన సొంత నిధులు వెచ్చించి, అప్పులు చేసి,తన, తన కుటుంబ సభ్యుల ఒంటిపై ఉన్న ఆభరణాలను సైతం తాకట్టు పెట్టి అభివృద్ధి పనులు చేసిన తమకు అధికారులు ఇచ్చిన గౌరవం ఒక సస్పెన్షన్ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పనులు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసే అధికారులు నిధులు ఎందుకు మంజూరు చేయరని నిధులు మంజూరు చేయకుండా మాతో పనులు చేయించి చివరికి ఇలాంటి అభియోగాలు మోపి అవమానపరచడం సరికాదన్నారు
స్మశాన వాటికలు, రైతు వేదికలు, సెగ్రీ గేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, హరితహారం తో పాటు పలు ప్రభుత్వ పథకాలను అప్పటికప్పుడు గ్రామస్థాయిలో అమలు చేసేందుకు తాము నిర్విరామంగా శ్రమిస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా గ్రామపంచాయతీ అభివృద్ధి ముఖ్యంగా పనిచేసిన తమపై ఇలాంటి చర్యలకు పాల్పడడం సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, పెద్దమందడి మండల పరిషత్ ఉపాధ్యక్షులు రఘు ప్రసాద్, వెల్టూర్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, చీకరుచెట్టు తండా సర్పంచ్ రాధాకృష్ణ, ఎంపీటీసీ దామోదర్ కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచి ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పర్వతాలు, మాజీ సర్పంచులు గట్టు మమన్నెం చింతకాయల వెంకటేష్, సత్య శీలా రెడ్డి, మండలాధ్యక్షుడు పెంటయ్య, నాయకులు వివేకానంద, వెంకటేశ్వర్ రెడ్డి టైలర్ రవి రాజశేఖర్ శెట్టి, ప్రవీణ్ కుమార్ రెడ్డి నరేష్ తదితరులు పాల్గొన్నారు