నిత్యవసరాలకు రెక్కలు

డోర్నకల్ జూలై 8 జనం సాక్షి
ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా పోరాటాలతో ప్రతిఘటించి  సమస్యలను పరిష్కరించేది నిస్వార్ధ కమ్యూనిస్టులేనని సిపిఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి అన్నారు.సిపిఐ డోర్నకల్ మండల 17వ మహాసభలు పట్టణ కేంద్రంలోని అశోక్ భవన్లో గుంశావల్లి అధ్యక్షతన జరగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డిలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలైనా ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించాయని వాటి అమలుకై కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగే  పోరాటాలకు ప్రజలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
గత ఎనిమిది సంవత్సరాలలో గ్యాస్ ధర 170 శాతం పెరిగిందని ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా గ్యాస్ బండ ధర పెంచడం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించే యంత్రాంగం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కేంద్ర ప్రభుత్వ విధానాలపై చిత్తశుద్ధితో పోరాటాలు సలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మహాసభలో 9 మందితో నూతన మండల కమిటీని మండల కార్యదర్శిగా తురక రమేష్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగినది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలను అమలు పరచడంలో తీవ్రత థాత్సర్యం చేస్తుందని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలతో కలిసి పోరాటాలు నిర్వహించాలని కోరారు.
ఈమండల మహాసభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ గౌడ్,నెల్లూరు నాగేశ్వరరావు,కె.ప్రబేష్ ఎస్.కె గుంశావళి మౌలానా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area