నిబందనల మేరకు ఆర్‌ఎంపిల వైద్యసేవలు

అతిగా వ్యవహరించకుండా అధికారుల హెచ్చరికలు
అనంతపురం,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జిల్లాలో ఇకనుంచి ఆర్‌ఎంపీలు బాధ్తయాయుతంగా పనిచేయాల్సి ఉంటుంది. వైద్యం పేరుతో అరాచకాలు చేయడం నేరంగా పరిగణిస్తారు. చట్టం ప్రకారం వైద్య సేవలు అందించాలే తప్ప పూర్తిస్థాయి డాక్టర్‌గా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రభృత్వ మార్గదర్శకాలకు లోబడి పని చేసుకోవాలి. ఇందులో ఏ చిన్న తప్పు, పొరపాటు జరిగినా సహించేది లేదని జాయింట్‌ కలెక్టర్‌ హెచ్చరించడంతో  వారిప్పుడు అయోమయంలో పడ్డారు. ఇంతకాలం గ్రామాల్లో వారు చెప్పిందే వైద్యంగా సాఆగుతోంది. అమాయక ప్రజలను వంచించే పద్దతికి ఇక స్వస్తి చెప్పకతప్పదు. ఆర్‌ఎంపీలు ఎవ్వరూ తమ పేర్ల ముందు డాక్టర్‌ అన్న పదాన్ని వాడకూడదని జెసి హెచ్చరిక చేశారు.  ఆస్పత్రి, క్లినిక్‌ అన్న పేర్లను కూడా రాయించుకోకుండా  కేవలం ప్రథమ వైద్య కేంద్రం అన్న పేరుతో బోర్డులు ఉండాలని మార్గదర్వకాలు ఇచ్చారు. శస్త్ర చికిత్సలు, ప్రసవాలు, యాంటిబయాటిక్‌ మందులు, సూదులు వాడినా కేంద్రాలను సీజ్‌ చేసి… క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని డీఎంహెచ్‌ఓ హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో ప్రథమ చికిత్స మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఆర్‌ఎంపీలు ఎవ్వరూ డాక్టర్‌ అని రాసుకోవడం.వ్యాధి నిర్దరణ పరీక్షలు చేయడం. ఐవీ ఫ్లూయిడ్స్‌ ఎక్కించకూడదు. ఆస్పత్రి..క్లినిక్‌ అని పేరు రాయించుకోవద్దు. స్టైరాయిడ్స్‌ సూదులు,మందులు ఇవ్వకూడదని ఆదేవించారు. దీంతో వీరు ప్రాథమిక వైద్యానికి అదికూడా జ్వరం,జలుబు లాంటి చికిత్సలకు పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రథమ చికిత్స మాత్రమే అందించాలి. ఏవైన చిన్న గాయాలకు వైద్యం చేయొచ్చు. వ్యాధులు రాకుండా సలహా, సూచనలు ఇవ్వవచ్చు. నిర్దేశిత షరతులను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.

తాజావార్తలు