నిరాశపరిచిన గగన్ నారంగ్

Gagan-Narang-outహైదరాబాద్ షూటర్ గగన్ నారంగ్.. రియో ఒలింపిక్స్ లో నిరాశపరిచాడు. గత లండన్ ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ అందుకున్న పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ లో ఈసారి ఫైనల్ కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. అభినవ్ బింద్రాతో పాటు ఈ ఈవెంట్ బరిలో దిగిన నారంగ్ డిసప్పాంట్ చేస్తూ ఏకంగా 23వ స్థానంలో నిలిచాడు.

50 మంది పోటీపడ్డ క్వాలిఫికేషన్ రౌండ్ ను హైదరాబాద్ షూటర్ గ్రాండ్గా ఆరంభించాడు. తొలి రౌండ్ లో చక్కని టార్గెట్ లతో 105.3 పాయింట్లు నమోదుచేశాడు. ఇక రెండో రౌండ్లోనూ మెరుగ్గా 104.5 పాయింట్లు స్కోరు చేసిన గగన్ నారంగ్.. కీలక దశలో వెనకబడ్డాడు.
మూడో రౌండ్ లో టార్గెట్ లు సరిగా లేక 102.1 పాయింట్లు మాత్రమే స్కోర్ చేసిన గగన్ నారంగ్.. ఆ తర్వాత అయిదో రౌండ్ లోనూ తక్కువ పాయింట్లకే పరిమితమయ్యాడు. చివరి రౌండ్ లో 104.8 పాయింట్లు నమోదుచేసినా ఫలితం లేకపోయింది. ఓవరాల్ గా 621.7 పాయింట్లతో 23వ స్థానం పొందాడు. ఫైనల్ చేరడంలో విఫలమయ్యాడు.

తన ఫేవరెట్ ఈవెంట్ పది మీటర్ల ఎయిర్ రైఫిల్ అంశంలో మెడల్ కు దూరమైన గగన్ నారంగ్.. మరో రెండు ఈవెంట్లలో బరిలోకి దిగుతున్నాడు. 12న జరిగే 50 మీటర్ల రైఫిల్ ప్రోన్, 14న జరిగే 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్ లలో పోటీపడనున్న నారంగ్.. ఈసారి కూడా మెడల్ తో మురిపిస్తాడేమో చూడాలి.