నిరుద్యోగభృతి..నైపుణ్యాల శిక్షణ

ఎపిలో మారుతున్న పరిస్థితులు

ఐటి కంపెనీల రాకతో చిగురిస్తున్న ఆశలు

అమరావతి,జూలై31(జ‌నం సాక్షి): ఆలస్యంగా అయినా ఎపిలో ఇప్పుడిప్పుడే అనేక పథకాలుశరవేగాంగా ముందుకు సాగడంతో నిరుద్యోగులకు మంచి రోజులు రాబోతున్నాయి. ఓ వైపు ఐటి కంపెనీలు మెల్లగా క్యూ కడుతున్నాయి. అంకుర కంపెనీలకు ప్రోత్సాహం దక్కుతోంది. ఒకప్పుడు ఐటి అంటే హైదరాబా/- అన్న భావన ఇప్పుడు ఎపికూడా అందిపుచ్చుకోబోతోంది. విజయవాడ, మంగళగిరి, గుంటూరు, విశాఖ పట్టణాలను ఐటి పరంగా విస్తృతం చేసే పనిలో మంత్రి లోకేశ్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తామని, ఉద్యోగం కల్పించలేకపోతే భృతిచెల్లిస్తామని ఎన్నికల వేళ ఇచ్చిన హావిూ మేరకు ప్రైవేట్‌ రంగంలో అవకాశాలకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దాదాపు మూడున్నరేళ్ల తర్వాత నిరుద్యోగులకు భృతికి సంబధించిన కూడా కార్యాచరణ మొదలయ్యింది. ఎంప్లాయీమెంట్‌ ఎక్స్‌చేంజ్‌ కేంద్రాల గణాంకాల ప్రాతిపదికగా ప్రతిపాదించిన నిరుద్యోగుల అర్హత నియమావళిని రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్న అంచనా ఉంది. అయితే తొలుత తొమ్మిది లక్షల మంది మాత్రమే నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వం ప్రకటించినా అందుకు అడుగు పడిందన్న భావన నిరుద్యోగుల్లో వ్యక్తం అవుతోంది. యువతలో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు చేసే ప్రయత్నం మినహా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హావిూలను నెరవేర్చేలా కనిపించడం లేదన్న విమర్శలు మరోవైపు ఉన్నాయి. అయితే ఓ ప్రయత్నం అంటూ మొదలయితే దానిని పట్టుకుని ముందుకు సాగడం ద్వారా మరిన్ని అవకాశాలను పొందవచ్చని అంటున్నారు. సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులు పూర్తి చేసి ఏటా బయటకు వస్తున్న 3.2 లక్షల మంది యువతీయువకులలో 75 శాతం మంది సరైన నైపుణ్యత లేక ఉపాధి పొంద లేకపోతున్నారని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. వారికి నైపుణ్యాలపై శిక్షణ అవసరమని ప్రతిపాదించారు. అందుకు

అనుగుణంగా ఇటు తెలంగాణలో కూడా కార్యాచరణ మొదలయ్యింది. ఇకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఎంప్లాయీమెంట్‌ ఎక్స్‌చేంజీల్లో పేర్లు నమోదు చేసుకున్నవారిలో ఎక్కువ అర్హతలున్నవారు ఎక్కువే ఉన్నారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, ప్రయివేటు నియమాకాలతో శాశ్వత ఉద్యోగాల కల్పనలో కొంత మందగమనం ఉన్నా అన్ని ఉద్యోగాలను ప్రభుత్వ పరంగా ఇవ్వడం అసాధ్యం అన్న విసయం యువత కూడా గ్రహించింది. అయితే అర్హతలను పరిగణనలోకి తీసుకొని నిరుద్యోగులకు గుర్తించేందుకు ప్రభుత్వం ఒక శాస్త్రీయమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరముంది. చదువు, వయసుతో పాటు ప్రభుత్వం ప్రతిపాదించిన మిగిలిన షరతులు కూడా నిరుద్యోగులకు ప్రతిబంధకంగా లేకుండా చూడాల్సి ఉంది. భృతి తీసుకునే వారు తప్పనిసరిగా ప్రభుత్వం అందించే శిక్షణకు హాజరుకావాల్సివుంటుందనీ, శిక్షణ కాలంలో మూడు రోజులు గైర్హాజరయితే భృతి నిలిపేయాలని ప్రతిపాదించారు. జాబు రావాలంటే బాబు రావాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పీఠమెక్కిన తరవాత విభజన సమస్యలతోనే ఇంతకాలం గడపాల్సి వచ్చింది. ఇపూ/-పుడిప్పుడే వ్యవహారం ఓ కొలిక్కి వస్తుండడంతో దీనిని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. మూడున్నరేళ్లు అవుతున్నా జాబు రాలేదన్న వారు ఇరు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. ప్రతి ఏటా డిఎస్సీ విడుదల చేస్తామన్న పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నోటిఫికేషన్‌నే కొనసాగించారే మినహా గత మూడేళ్లలో కొత్తగా ఒక్కటంటే ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వలేకపోయారు. హేతుబద్దీకరణతో వేలాది పాఠశాలలను మూసివేసి అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పన అన్నది అందని ద్రాక్ష మాత్రమే. లక్షల్లో నిరుద్యోగులు ఉన్నప్పుడు వారిని అందరికి ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. ఏ ప్రభుత్వానికైనా ఇది అసాధ్యమే. అందుకే ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్‌ రంగం విస్తరిస్తేనే ఉద్యోగాలు లభిస్తాయి. అంతర్జాతీయస్థాయిలో ఏర్పాటు చేస్తామన్న నైపుణ్యాభివృద్ధి కేంద్రం, ప్రతి కళాశాలలో ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఏర్పాటు వంటివన్నీ ఇందులో భాగంగా చేపడుతున్నవే. ఏపిపిఎస్సీని ప్రక్షాళన చేసి ప్రతి ఏటా కేలండర్‌ ప్రకటించి నోటిఫికేషన్ల ఇస్తామని టిడిపి ప్రకటించింది. ఈ మూడేళ్లలో 2016లో మాత్రమే కేలండర్‌ విడుదల చేసింది. కేలండర్‌ ప్రకారమే జులై నెలలోనే నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేయాల్సివుండగా ఒక్కటీ రాలేదు. అందుకే యువతకు ఉపాధి

కల్పనలో తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ది ప్రకటించి నిరుద్యోగభృతిని ప్రతిపాదించింది. నిరుద్యోగు లందరికీ భృతి ఇస్తూనే ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యతనిచ్చి వారిని నిష్ణాతులుగా చేసేందుకు కార్యాచరణ చేపట్టనున్నారు.

 

తాజావార్తలు