నిరుద్యోగ సమస్యపై చిత్తశుద్ది లేని బాబు

కార్పోరేట్లకు అనుకూలంగా నిర్ణయాలు : సిఆర్‌

కడప,జూలై31(జ‌నం సాక్షి): రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీర్చడంలో, కొతత పరిశ్రమలను రప్పించడంలో ఈ నాలుగేళ్ల కాలంలో బాబు విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య అన్నారు. ప్రత్యేక¬దా వల్ల ఏం ఒరుగుతుందని చంద్రబాబు గతంలో పేర్కొన్నారని ఇప్పుడేమో తామే ¬దా కోసం పోరాడుతున్నట్లుగా బిల్డప్‌ ఇస్తున్నారని మండిపడ్డారు. ¬దావల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించడానికి తాను సిద్ధమేనని గతంలోనే సవాల్‌ విసిరితే బాబు ఎదురుదాడి చేసిన సంగతి మరిచి పోయారని అన్నారు. రూ.16 వేల కోట్లలోటు బడ్జెట్‌ ఉందని చెబుతున్న చంద్రబాబు వృథా ఖర్చులను ఎందుకు తగ్గించడంలేదని ప్రశ్నించారు.విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ద్వారా ఎన్ని పరిశ్రమలు స్థాపించారో వివరాలు కావాలని సహ చట్టం ద్వారా దరఖాస్తు చేశామని తెలిపారు. రూ.4.56 లక్షల కోట్లు విలువైన పరిశ్రమలు వస్తాయని, 10 వేల ఉద్యోగాలు కల్పిస్తామని వివరణ ఇచ్చారన్నారు. అయితే ఇప్పటి వరకు రూ.10 వేల కోట్ల విలువైన పరిశ్రమలు కూడా రాలేదన్నారు. భాగస్వామ్య సదస్సులు విజయవంతమయ్యాయని ప్రకటిస్తున్నారని.. విమాన టిక్కెట్లు, ఐదునక్షత్రాల ¬టళ్లలో విడిది ఇచ్చి, కమ్మని భోజనం పెట్టినంత మాత్రాన అవి విజయవంతం అయినట్లేనే అని ప్రశ్నించారు.రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూల పరిస్థితి లేదని రామచంద్రయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు వెంటనే అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదని, కిందిస్థాయి ఉద్యోగి నుంచి సీఎం స్థాయి వరకూ పర్సంటేజీలు ఇవ్వాల్సి వస్తుందన్నారు. రాయితీలు ఇవ్వడం లేదని, అనుమతులకు ఏడాది సమయం పడుతుందన్నారు. గుజరాత్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తక్షణం అనుమతులు ఇస్తున్నారని చెప్పారు. పెద్దనోట్లను రద్దు చేసి ప్రధానమంత్రి మోదీ కార్పొరేట్‌ సంస్థలకు లాభాన్ని చేకూర్చారని అన్నారు. అలాగే జిఎస్టీతో అనేక పరిశ్రమలు, సంస్థలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. జిఎస్టీతో ఆయా రంగాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వానికి శ్రద్దలేదన్నారు. కార్పోరేట్‌ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు ఉంటున్నాయని అన్నారు. దేశంలో ఉన్న నల్లధనం, నకిలీ కరెన్సీని అంతం చేసేందుకు పెద్దనోట్లను రద్దు చేస్తున్నామని చెప్పినా అలాంటి ప్రయత్నాలు జరగలేదన్నారు. ఎంత నల్లధనం వెలికితీశారో చెప్పలేని దుస్థితి ఉందన్నారు. వాస్తవానికి కార్పొరేట్‌ సంస్థలకు, బడా పెట్టుబడీదారులకు మాత్రం అనుకూలంగా నిర్ణయాలు ఉంటున్నాయని అన్నారు. పరిశ్రమల ఆదాయం 50శాతానికి పడిపోయి కార్మిక, ఉపాధి రంగాలు కుంటుపడ్డాయన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలు నేటికీ ఇబ్బందులు పడుతున్నారన్నారు.

————–

తాజావార్తలు