నిరుద్యోగ సమస్య తీరుస్తాం సీఎం చరణ్‌జిత్ సింగ్
చండీఘడ్: పంజాబ్చన్నీ ఇవాళ భారీ ప్రకటన చేశారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. 20వ తేదీన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప్రజల్ని తమ వైపు మళ్లించుకునేందుకు తప్పుడు వాగ్ధానాలు చేయబోమన్నారు. చాలా వాస్తవమైన, విశ్వసించగదని హామీలను మాత్రమే ఇస్తామన్నారు. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్ని సీఎం చన్నీ అన్నారు. పంజాబీ యువతకు లక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పేదింట మహిళలను, ఇండ్లి లేనివారిని ఆదుకోనున్నట్లు ఆయన చెప్పారు.