నిరుపేద చిన్నారులకు శస్త్ర చికిత్సకు

స్పందన కార్యక్రమం దోహదం

కరీంనగర్‌, జనవరి 28 (): హృదయస్పందన కార్యక్రమానికి పశుసంవర్థక శాఖ సిబ్బంది ఒక రోజు వేతనం 2లక్షల 78వేలు అధిక మొత్తంలో విరాళం అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ అన్నారు. 12 సంవత్సరాల లోపు నిరుపేద కుటుంబాల చిన్నారులకు ఖరీదుతో కూడిన గుండె సంబంధ ఇతర శస్త్ర చికిత్సలు, నిర్వహించి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి హృదయ స్పందన కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అన్నారు. హృదయ స్పందన కార్యక్రమం ద్వారా  ఎక్కువ మంది పేదవారికి ఆర్థిక సహాయం అందించుటకు వీలుగా జిల్లాలో పశుసంవర్థక శాఖ సిబ్బంది ఒక రోజు జీతం విరాళంగా ఇచ్చిన ఇతరులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని వారి ఛాంబర్‌లో పశుసంవత్సర్థక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్‌ సి.సుభాష్‌రెడ్డి 2లక్షల 78వేల రూపాయల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, మెట్‌పల్లి, సుజోరాబాద్‌, ఎ.డి.లు డాక్టర్‌ వెంకటేశ్వర్లు, డాక్టర్‌ అశోక్‌రాజు తదితరులు పాల్గొన్నారు.