నిర్మాణంలో ఉన్న పోలీస్ అవాసాలపై మవోయిస్టుల దాడి : ఇద్దరు కూలీల మృతి
జార్ఖండ్ : నిర్మాణంలో ఉన్న పోలిసు క్వార్టర్లపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. జార్ఖండ్‌లోని గిరిధిహ్ పట్టణ శివార్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం వేకువజామునే దాడి చేసిన మావోయిస్టులు పలు భవంతులు ధ్వంసం చేయాడంతో పాటు ఇద్దరు కూలీలను పొట్టనపెట్టుకున్నారు. ”మవోయిస్టులు బాంబు పేల్చడంతో నిర్మాణంలో ఉన్న పోలీసు ఆవాసం భవంతి పైకప్పునకు భారీ కన్నం పడింది. ఇద్దరు కూలిలు మరణించారు.” అని ఎస్పీ ఎ.వి. హోంకార్ విలేకరులకు తెలిపారు. పోలీసులు 30కేజిల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకొని నీర్వీర్యం చేశారు. రూ. 30 కోట్లతో 72 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ పోలిసు నివాస సముదాయం పూర్తయితే తమకు మరిన్ని సవాల్లు ఎదురవుతాయని మావోయిస్టులు అందోళన చేందుతున్నారు.