నిర్వాసిత కాలనీల్లో త్వరగా పనులు

శ్రీకాకుళం,నవంబర్‌29(జ‌నంసాక్షి): నిర్వాసిత కాలనీల పనులను త్వరగా  పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి ఆదేశించారు. మరికొన్ని గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉన్నందున ముందుగా వారికి సమాచారం అందజేసి ఖాళీ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వారికి అవసరమైన రవాణా, తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. వంశధార నిర్వాసిత కాలనీల పనులపై ఆయన సవిూక్షించారు. నిర్వాసిత కాలనీలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కాలనీల్లో అవసరమైన వసతులను కల్పించాలని తెలిపారు. కాలనీల్లో ఎల్‌ఈడి దీపాలను అమర్చేందుకు నెడ్‌ క్యాప్‌కు రూ.47 లక్షల నిధులను విడుదల చేసినట్లు, పనులను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. కాలనీల్లో అవసరమైన తాగునీరు, సీసీ రహదారులు, తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇరపాడు గ్రామంలో 16, దుగ్గుపురం గ్రామంలో 44 గృహాలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని, గృహ యజమానులతో చర్చించి చర్యలు చేపట్టాలన్నారు. ఇదిలావుంటే జలాశయాలపై నిర్లక్ష్యం తగదని,సత్వరం వాటికి మరమ్మతులు చేపట్టాలని  జలవనరుల ఉన్నతాధికారులను ఆదేశించారు. మందస మండల పరిధిలోని  సాగునీటి వనరులైన డబార్శింగి, కళింగదళ్‌ జలాశయాలు, సునాముధి కాలువను పరిశీలించారు. డబార్శింగి జలాశయం మదుంల నుంచి, పరుపులకు ఏర్పడిన రంధ్రాల నుంచి నీరు వృథా అవడాన్ని చూసి తక్షణం మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఈసందర్భంగా అదనంగా సాగునీటి కాలువ ఏర్పాటుచేయాలని కొంటాసాయి, కుమ్మరకుట్టి, డబార్శింగి గిరిజనులు కోరారు. ఈవిషయాన్ని ఎస్‌ఎంఐ అధికారులతో మాట్లాడి అవకాశముంటే కాలువ నిర్మించాలని సూచించారు. గిరిజనుల్లో చాలామందికి వేలిముద్రలు పడక పింఛన్లు అందడం లేదు. వేలిముద్రలు వాయుగుండం ప్రభాంతో చాలా గ్రామాల్లో పంట నీటి మునిగింది. నేల వాలడంతో రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. నష్టపోయిన ప్రతీ రైతుకు ప్రభుత్వ సాయమందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.