నిలకడగా లాలూ యాదవ్ ఆరోగ్యం
వెల్లడిరచిన కుటుంబ సభ్యులు
న్యూఢల్లీి,జూలై8(జనం సాక్షి)): బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన కుమార్తె విూసా భారతి వెల్లడిరచారు. ఇతరుల సహాయంతో ఆయన నిలబడగలుగు తున్నారని తెలిపారు. గతంలో కంటే లాలూ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉందని భారతి పేర్కొన్నారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ ఢల్లీిలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్‌ను పాట్నా నుంచి ఢల్లీిలోని ఎయిమ్స్‌కు బుధవారం సాయంత్రం తరలించిన సంగతి తెలిసిందే. గత వారం లాలూ తన ఇంట్లోనే మెట్లు ఎక్కుతుండగా జారి పడ్డారు. దీంతో ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం పాట్నాలోని పారాస్ ఆస్పత్రికి తరలించారు. లాలూ భుజం, వెన్నెముకకు తీవ్ర గాయమైనట్లు డాక్టర్లు నిర్దారించారు. మెరుగైన వైద్యం కోసం ఢల్లీి ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.