నీటిపారుదల శాఖ డీఈఈకి నోటీసులు

మెదక్‌: మెదక్‌ నీటిపారుదల శాఖ డీఈఈ సలీంకు ఈఈ బాలరాజు ఈరోజు నోటీసులు జారీ చేశారు. ఆందోల్‌ ప్రభుత్వ అతిధి గృహాన్ని ఆరు నెలలుగా డీఈఈ సలీం సొంత కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు ఈనాడు-ఈటీవి ప్రచురించిన కథనాలకు స్పందనగా అధికారులు చర్యలు తీసుకున్నారు.