నీటి విడుదల ఆపడంతో షట్టర్లు మూసిన రైతులు
కడప,నవంబర్14(జనంసాక్షి): అనంతపురం జిల్లాలోని గొడ్డుమర్రి వద్ద దిగువ ప్రాంతాలకు కృష్ణా జలాల విడుదలను అధికారులు నిలిపివేయడంతో బుధవారం ప్రజలు ఆగ్రహించి కొండాపురం వద్ద జికెఎల్‌ఐఎస్ ఒకటి వద్దకు వెళ్లి మోటర్లు ఆపివేసి షట్టర్లు మూసివేశారు. కొండాపురం మండలంలోని చిత్రావతి నుండి జికెఎల్‌ఐఎస్ 1,2,3,4,5,6 ద్వారా పులివెందుల ప్రాంతానికి కృష్ణా జలాలను తరలిస్తున్న దశలో.. అనంతపురం జిల్లాలోని గడ్డంవారిపల్లి వద్ద నున్న జికెఎల్‌ఐఎస్ 3 నుండి చిత్రావతి నదిలోకి నీటిని విడుదల చేసినట్లయితే మండలంలోని పొట్టిపాడు, యనమలచింతల, వెంకయ్య కాలువ , బెడుదూరు, తిమ్మాపురం, చిన్నపపల్లే ,ఏటూరు గ్రామాల వారి కోరిక మేరకు కఅష్ణా జలాలు దిగువ ప్రాంతాలకు ఒక టిఎంసి నీరు విడుదలకు అధికారులు అంగీకరించారు. ఈ కోవలో గత ఐదు రోజులుగా నీటిని విడుదల చేశారు. నీరు కొంత భాగం చేరుకోగానే బుధవారం అధికారులు నీటి విడుదల ఆపివేయడంతో ప్రజలు ఆగ్రహించారు. కొండాపురం వద్ద నున్న జికెఎల్‌ఐఎస్ ఒకటి వద్దకు వెళ్లి మోటర్లు ఆపివేసి షట్టర్లు మూసివేశారు.