నీరు విడుదల చేయండి

ఢిల్లీ: తమిళనాడు రాష్ట్రానికి 9 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కావేరీ నదీజలాల అధారిటీ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరో 15 రోజుల్లోగా 9 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకకు ఆదేశాలు జారీ చేసింది.