నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో మతప్రచారం

విచారణకు విసిని ఆదేశించిన మంత్రి గంటా

విజయవాడ,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో మత ప్రచారం జరిగిన ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తక్షణం విచారణ చేయించాలని మంత్రి గంటా విసిని ఆదేశించారు. అయితే ఇక్కడ మతప్రచారం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని ట్రిపుల్‌ ఐటీ వీసీ రామచంద్ర రాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ మత ప్రచారం జరుగుతున్నట్టు విచారణలో తేలిందని చెప్పారు. మతప్రచారం వెనుక ఎవరి హస్తం ఉందో విచారిస్తున్నామని ఆయనన్నారు. విద్యార్థులు తమ ప్రతిభ ఆధారంగానే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని, ఈ తరహా మత విశ్వాసాలను ఎవరూ నమ్మవద్దు రామచంద్ర రాజు సూచించారు. కాగా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో మత ప్రచారంపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మంత్రి గంటా శ్రీనివాసరావు వీసీని ఆదేశించారు.

తాజావార్తలు