నూతన అసెంబ్లీ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు అధికారికంగా ప్రకటించాలి
హుజూర్ నగర్ సెప్టెంబర్ 15 (జనం సాక్షి): నూతనంగా ముస్తాబవుతున్న అసెంబ్లీ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు అధికారికంగా ప్రకటించాలని హుజూర్ నగర్ నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షులు కోల్లపూడి యోహాను అన్నారు. గురువారం హుజూర్ నగర్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కోల్లపూడి యోహాను ఆధ్వర్యంలో మాల మహానాడు ముఖ్యల సమావేశం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు లేకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా నోటిఫికేషన్ జారీ చేశారని అన్నారు. చాలామంది నిరుపేద దళిత యువతి, యువకులు ప్రవేట్ కోచింగ్లు తీసుకునే స్తోమత లేక రిజర్వేషన్లు నైనా క్వాలిఫైడ్ అయితామని ఎదురుచూపులు చూస్తున్న వారి ఆశలపై నీరు జల్లెల రిజర్వేషన్లు ఎత్తివేసారని వెంటనే తెలంగాణ ప్రభుత్వం జరుగుతున్నటువంటి అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్ విడుదల చేయాలని తెలంగాణ మాల మహానాడు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు పోతుల జ్ఞానయ్య, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లచ్చుమల్ల నరసింహారావు, గౌరవ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సాలె రామారావు, జిల్లా అధ్యక్షులు సూదుల రాములు, జిల్లా నాయకులు ధార ప్రకాష్, రాష్ట్ర మహిళ నాయకురాలు శీలం స్వరూప, జిల్లా మహిళా అధ్యక్షురాలు జక్కి జై కన్య, ఉపాధ్యక్షులు కందుల నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.