నేరడిగొండఆగస్టు25(జనంసాక్షి):మండలం పాత్రికేయుల నూతన కార్యవర్గాన్ని బుధవారం రోజు సూర్య గార్డెన్ లోఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షులుగా కొప్పుల ప్రమోద్,గౌరవ అధ్యక్షులుగా షేక్ ఫషియోద్దీన్ ఉపాధ్యక్షులుగా ఏలేటి సృజన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా జాదవ్ రామారావ్,కోశాధికారి పోతన్న,సంయుక్త కార్యదర్శి అజయ్,సలహాదారులు షేక్ అజార్,గౌరవ సలహాదారులు దేవేందర్,సలహా సభ్యులు మదన్ సింగ్,కార్యదర్శి గంగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.సభ్యులుగా రవి, రాథోడ్ నారాయణ, శోభన్ రెడ్డి, ఆశోక్ లు ఎన్నికయ్యారు.వీరిని.గురువారం రోజున మండల ఎంపీపీ రాథోడ్ సజన్ ఘనంగా శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజాన్ని అభివృద్ధి వైపు అడుగులేసేలా సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్ తోపాటు ఎంపీటీసీలు నాయకులు కృష్ణ బింరావు తదితరులు ఉన్నారు.
