నూతన మండలం కేంద్రంగా సీరోలు

– డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్
c జులై –
(జనం సాక్షి న్యూస్)
సిరోలు గ్రామానికి మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు.ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో 13 కొత్త మండలాలకు తెరలేపింది.ఇందులో మహబూబాబాద్ జిల్లాలోని ప్రజల, ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు. కొత్తగా సీరోలు మండలాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటైన సీరోలు మండలంలో ఈ క్రింది  గ్రామాలున్నాయి.
– కురవి మండల పరిధిలోని 5 ఉమ్మడి గ్రామపంచాయతీలు.
డోర్నకల్ మండలంలోని మన్నెగూడెం. సిరోలు మండల పరిధిలోకి వచ్చే మొత్తం గ్రామపంచాయతీలు 17 అవి సిరోలు, కొర్లకుంట తండా, రేకుల తండా,కాంపల్లి,కాంపల్లి తండా (సక్రం నాయక్ ) భీమ్లా నాయక్ తండ, ఉప్పరిగుడం, గొప్పతండ,బూరుగు చెట్టు తండా,తాళ్ల సంకీసా,వస్తాం తండా,చింతపల్లి, కొత్తూరు సి, మన్నెగూడెం, చిలక్కోయాలపాడు, అందనాలపాడు,మొద్దు గడ్డ తండా మొత్తం గ్రామపంచాయతీలతో ఏర్పడుతోంది డిఎస్ రెడ్యా అన్నారు.సిరోలు మండల పరిధిలోని జనసంఖ్య మొత్తం 23,318, సీరొలు ను మండల కేంద్రంగా ప్రకటించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్న డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్, మహబూబాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత.
Attachments area