నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరుని ప్రతిపాదించిన సందర్భంగా కెసిఆర్ కు క్షీరాభిషేకం.
ఏర్గట్ల సెప్టెంబర్ 21 (జనం సాక్షి ): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపకల్పన చేసిన ఆర్టికల్ 318 రాజ్యాంగం ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అసెంబ్లీ సాక్షిగా కెసిఆర్ ప్రకటన చేయడం, అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయం భవనానికి అంబేద్కర్ పేరును ప్రతిపాదన చేసిన సందర్భంగా బుధవారం నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, మండల తెరాస అధ్యక్షులు రాజపూర్ణానందం, గ్రామ శాఖ అధ్యక్షులు తుపాకుల శ్రీనివాస్ గౌడ్, తెరాస సీనియర్ నాయకులు లక్కం నరసయ్య, దళిత సంఘాలు అంబేద్కర్ విగ్రహానికి, సీఎం కెసిఆర్, మంత్రి వేముల చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అంబేద్కర్ కి సముచిత స్థానం కల్పించి అంబేద్కర్ పట్ల, దళితుల పట్ల అపారమైన అభిమానం చూపరని, అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకునే మనస్తత్వం కెసిఆర్ దని,కెసిఆర్ కు, ప్రశాంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జక్కని మధు, వీడీసీ అధ్యక్షులు బద్దం ప్రభాకర్ రెడ్డి, దళిత సంఘాల నాయకులు గన్నారపు రాజేశ్వర్, సంగెం శివరాం, అట్ల పోచయ్య, పౌలింగ్, భీమ గంగాధర్, ముత్తెన్న, తలారి మోహన్, చిన్న సాయన్న తదితరులు పాల్గొన్నారు.