నూతన హైకోర్టుకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

ఏర్పాట్లను సవిూక్షించిన జిఎడి కార్యదర్శి శ్రీకాంత్‌

అమరావతి,జనవరి23((జ‌నంసాక్షి): వచ్చే నెల 3వ తేదీన నూతన హైకోర్టు భవనాల ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సచివాలయంలో సవిూక్షించారు. హైకోర్టుకు పటిష్ఠ పోలీస్‌ భద్రత కల్పించడంతోపాటు, ఫైర్‌ సర్వీసులు, ట్రాఫిక్‌, ఫార్కింగ్‌, ప్రముఖుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్‌ ఆదేశించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులకు భద్రత కల్పించడంతోపాటు, వారి రాకపోకలు సజావుగా సాగేలా చూడాలని ¬ంశాఖ కార్యదర్శి అనూరాధ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. వీఐపీల వాహనాలకు, ఇతరుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ సదుపాయం కల్పించాలని ఆమె సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని రక్షణ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భవనాలకు బయోఫెన్సింగ్‌ వేయడంతోపాటు, పోలీస్‌ అవుట్‌ పోస్టులు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఫిబ్రవరి 3వ తేదీ హైకోర్టు భవనాల ప్రారంభోత్సవాలకు ప్రముఖులతోపాటు, భూములిచ్చిన అనేక మంది రైతులను కూడా ఆహ్వానించనున్నారు. ప్రారంభోత్సవానికి దాదాపు 5 వేల మంది హాజరయ్యే అవకాశం ఉండటంతో వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు సవిూక్షించారు. భోజన సదుపాయాలతోపాటు,రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాటు చేయాలని ¬ంశాఖ కార్యదర్శి అనూరాధా అధికారులను ఆదేశించారు. న్యాయమూర్తుల ఇంటి వద్ద గార్డులను ఏర్పాటు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ సవిూక్షలో సమాచార శాఖ కమిషనర్‌ ఎస్‌. వెంకటేశ్వర్‌, ఏపీ హైకోర్టు రిజిస్టార్ర్‌ రాంబాబు పాల్గొన్నారు. సవిూక్ష అనంతరం పోలీసు, అగ్నిమాపకశాఖ, సీఆర్డీయే అధికారులు హైకోర్టు భవనాలను పరిశీలించారు.