నూలు పోగులతో అపురూప “కళ” చిత్రం. సిరిసిల్ల చేనేత కళాకారుడు హరిప్రసాద్ చేతిమగ్గంపై నేసిన “జీ 20” ప్రత్యేక చిత్రం. ప్రధాని మోడీ తోపాటు ప్రతినిధుల చిత్రాలు చేతిమగ్గంపై ఆవిష్కరణ.

చేతిమగ్గంపై నూలు పోగులతో అద్భుతాలను ఆవిష్కరించే చేనేత కళాకారుడు వెల్డీ హరిప్రసాద్. మరో నూతన ఆవిష్కరణ చేశారు. భారతదేశంలో జరుగుతున్న జీ20 సమావేశాలను పురస్కరించుకొని అపురూపమైన కళారూపాన్ని వెల్ది హరిప్రసాద్ చేతిమగ్గంపై నేసి సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభను మరోసారి జాతీయస్థాయిలో నిలబెట్టునున్నారు. సిరిసిల్ల చేనేత కళ కు జాతీయస్థాయి గుర్తింపు తీసుకొచ్చి దేశ ప్రధాని మోడీతో శభాష్ అనిపించుకున్న కళాకారుడు వెల్ది హరిప్రసాద్. మంకీ బాత్ కార్యక్రమంలో స్వయంగా ప్రధాని మోడీ వెల్ది హరిప్రసాద్ పేరును ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. ఇటీవలే సిరిసిల్ల బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేలా “సిరిసిల్ల సిరిపట్టు” చీరను వెల్ది హరిప్రసాద్ దంపతులు చేతిమగ్గంపై రూపొందించి గవర్నర్ తమిళ్ సై చేత ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం దేశంలో జరగనున్న జి20 సమావేశాల సందర్భంగా వెల్ది హరిప్రసాద్ చేతిమగ్గంపై భారతదేశ చిత్రపటం తో పాటు స్వాగతం పలుకుతున్న ప్రధాని మోడీ చిత్రాన్ని  20 దేశాల ప్రతినిధుల చిత్రాలు వచ్చేలా నూనె పోగులతో అపురూప కళా చిత్రాన్ని ఆవిష్కరించారు. జీ 20 లోగో జరి అంచుతో రూపొందించిన హరి ప్రసాద్ కళ చిత్రం  మరోసారి జాతీయస్థాయిలో సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభను చాటేలా చేతిమగ్గంపై ఆవిష్కరించారు. జి20 లోగోను గతంలో చేతిమగ్గంపై నేసిన హరిప్రసాద్ ఈసారి ప్రత్యేకంగా మన దేశంలో జరుగుతున్న జీ20 సమావేశాలను దృష్టిలో ఉంచుకొని చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. వారం రోజులపాటు కష్టపడి చేతిమగ్గంపై రెండు మీటర్ల వస్త్రంపై నూలు పోగుల మధ్య ఆవిష్కృతమైన కళా నైపుణ్యాన్ని చూసి అబ్బుర పడాల్సిందే. తగిన ప్రోత్సాహం అందిస్తే ఇలాంటి మరెన్నో కళారూపాలను ఆవిష్కరిస్తానని వెల్ది హరిప్రసాద్ ‘జనంసాక్షి”తో తెలిపారు.

తాజావార్తలు