*నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించిన-జిల్లా ఎస్పీ*

చట్టవ్యతిరేక కార్యకలపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి
  నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్20,,జనంసాక్షి,,,  పోలీస్ కార్యాలయంలోని కాన్ఫెరెన్స్ హాల్ లో మంగళవారం నిర్మల్ జిల్లా పరిధిలోని నిర్మల్, భైంసా డివిజన్ పరిధిలలో నేరాల నియంత్రణ కొరకు సంబంధిత డిఎస్పీలు మరియు సి.ఐలతో “సమీక్ష సమావేశం” జిల్లా ఎస్పీ .సిహెచ్.ప్రవీణ్ కుమార్  ఆద్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ . ప్రవీణ్ కుమార్  సి.సి.టి.ఎన్.ఎస్ ( క్రైమ్ క్రిమినల్ ట్రాకింక్ నెట్వర్కింగ్ సిస్టం ) యందు పోలీస్ స్టేషన్ లోనీ ఎఫ్.ఐ.ఆర్ కేసుల పరిశోధన వివరాలు ఎప్పటికప్పుడు పొందపర్చాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో, మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అండర్ ఇన్వేస్టిగేషన్ కేసులను త్వరగా పూర్తి చేయలి, గ్రామాలలో అవగాహన సదస్సులను నిర్వహించడం చేయాలని, అలవాటుపడిన నేరస్థులపై పి.డి యాక్టు నమోదు చేయాలని అన్నారు. డయల్ 100 ఫిర్యాదుల పట్ల త్వరితగతిన స్పందించాలని అన్నారు. ఎటువంటి చిన్న నేరాలు జరుగకుండా సంబంధిత అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో “నిఘా” వ్యవస్థ పటిష్ట పర్చలి, పెండింగ్లో ఉన్న N.B.W ల పై ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటుచేసి త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాట గురించి సూచించారు. మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి మొదలగు చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేకమైన “నిఘా” ఏర్పాటు చేయలి, కోర్టులలో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారానికి కృషిచేయల న్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఆటోలలో సామర్థ్యానికి మించి ప్యాసింజర్లను ఎక్కకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొవలని, మహిళల భద్రతకోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, వారికి అన్ని రకాల భద్రతల విషయంలో ఎల్లప్పుడు సహాకారం అందించాలని తెలియజేశారు. నిర్మల్ లోని పోలీస్ స్టేషన్ల వారిగా పెండింగ్ లో ఉన్న కేసులను క్షుణ్ణంగా సమీక్షించి త్వరితగతిన దర్యాప్తు ముగించడానికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్ పరిదులలో పెట్రోలింగ్ ముమ్మరం చేయడం, బీట్ల ఏర్పాటు రాత్రి సమయాలలో వాహనాల తనిఖీ చేసి దొంగతనాల నివారణకు కృషి చేయలని, ఇప్పటి వరకు జరిగిన నేరాలలో త్వరితగతిన పరిశోధన పూర్తిచేసి పెండింగ్ నేరాల శాతం తగ్గించాలని సూచించారు. నిర్మల్ పోలీస్ స్టేషన్ల వారిగా పెండింగ్ లో ఉన్న కేసులను క్షుణ్ణంగా సమీక్షించి త్వరితగతి న దర్యాప్తు ముగించడానికి తగిన సూచనలు ఇచ్చారు.
ఫిర్యాదులపై త్వరగా చర్యలు తీసుకుని బాధితులకు బరోసా కల్పించాలి, పోలీసు ప్రతిభ పెరిగేలా సిబ్బంది పనిచేయాలి అని అన్నారు. ఈ సందర్బంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఇన్స్పెక్టర్ లకు, ఎస్ఐలకు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో భైంసా ఏఎస్పీ కిరణ్ ఖరే ఐపిఎస్., నిర్మల్ డిఎస్పీ జీవన్ రెడ్డి, డిసిఆర్బి డిఎస్పీ రవీందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్స్ రమేష్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మహేందర్,, సి.ఐలు శ్రీనివాస్, అజయ్ బాబు, చంద్రశేఖర్, వెంకటేష్, ప్రవీణ్ కుమార్, ఎస్.ఐలు, ఐ.టి కోర్ ఇంచార్జ్ రవి కుమార్, ఐ.టి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Attachments area